ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:15 AM
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం సుమండి గ్రామ సమీపంలో నయారా పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించిది.
ఇచ్ఛాపురం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం సుమండి గ్రామ సమీపంలో నయారా పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించిది. ఈ ప్రమాదంలో కంటైనర్‌లో ఉన్న ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఆది వారం రాత్రి 10గంటల సమయంలో చెన్నై నుంచి ఒడిశా వైపు ద్విచక్ర వాహనాలతో వెళ్తున్న కంటైనర్ లారీని సుమండి వద్ద ఉన్న బంకుకు అతివేగంగా వచ్చి నిలిపారు. డ్రైవర్ ఆయిల్ ఫిల్ చేసేందుకు సిద్ధమవు తున్న సమయంలో ఒక్కసారిగా కంటైనర్ నుంచి మంటలు వ్యాపిం చాయి. వాటిని ఆర్పేందుకు బంకు సిబ్బంది ప్రయత్నించినప్పటికీ మం టలు అదుపులోకి రాకపోవడంతో ఒడిశా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిం చినా కంటైనర్‌లో పైభాగంలో ఉన్న బైక్‌లు సమారు 100 కాలిపోగా కింద భాగంలో ఉన్న మరో వంద బైక్‌లకు ఎటువంటి ప్రమాదం వాటిల్ల లేదు. దీంతో బంకు సిబ్బంది, వాహన డ్రైవర్ ఊపిరిపీల్చుకున్నారు. ఒడిశా నుంచి వచ్చిన ఫైర్ సిబ్బందితోపాటు ఒడిశా పోలీసులు వచ్చి మంటలు నియంత్రించడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా బంకు ను మూసివేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని బంకు సిబ్బంది తెలిపారు. అతివేగంగా కంటైనర్ రావడంతో మంటలు వ్యాపించాయని ఒడిశా పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఒడిశా పోలీసులు తెలిపారు.