Share News

రావివలసలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:15 AM

మండ లంలోని రావివలసలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.

 రావివలసలో అగ్నిప్రమాదం
మంటల్లో కాలిపోతున్న ఇల్లు

టెక్కలి రూరల్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని రావివలసలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన కాంతమ్మ అనే మహిళకు చెందిన రేకుల ఇల్లు అగ్నికి ఆహుతైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు రేగడంతో స్థానికులు గుర్తించి అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇంట్లోని దుస్తులు, తిండి సామగ్రి కాలి బూడిదయ్యాయని..కట్టుబట్టలతో రోడ్డున పడ్డానని కాంతమ్మ విలపిస్తోంది

Updated Date - Oct 02 , 2026 | 12:15 AM