Share News

పీకే పాలెంలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:12 AM

పెద్దకర్రివానిపాలెం గ్రామంలో గురు వారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులకు చెందిన వలలు, బోటు దగ్ధమయ్యాయి. వేట నిషేధిత సమయం కావడంతో వేట సామ గ్రిని తీరంలోని ఒక రేకుల షెడ్డులో మత్స్యకారులు భద్రపరిచారు. రాత్రి వలలు ఉంచిన షెడ్డు ప్రాంతంలో మంటలు రేగాయి.

పీకే పాలెంలో అగ్నిప్రమాదం
కాలిపోయిన బోటును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌, అధికారులు

వలలు, బోట్లు దగ్ధం

బాధితులకు ఎమ్మెల్యే అశోక్‌ పరామర్శ

కవిటి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): పెద్దకర్రివానిపాలెం గ్రామంలో గురు వారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులకు చెందిన వలలు, బోటు దగ్ధమయ్యాయి. వేట నిషేధిత సమయం కావడంతో వేట సామ గ్రిని తీరంలోని ఒక రేకుల షెడ్డులో మత్స్యకారులు భద్రపరిచారు. రాత్రి వలలు ఉంచిన షెడ్డు ప్రాంతంలో మంటలు రేగాయి. తీరంలో గాలులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలు వ్యాపించాయి. గ్రామస్థులు మంట లను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఈ ప్రమాదంలో ఎస్‌.వెంకటేశం, కె.కృష్ణారావు, కె.వేమన్న, కె.గోపాలరావు, కె.గణపతి, జి.తిరుపతిలకు చెందిన వలలు పూర్తిగా కాలిపోయాయి. జి.బాబూరావుకు చెందిన బోటు దగ్ధమైంది. సుమారుగా రూ.1.50 కోట్ల నష్టం వాటిల్లినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, మెరైన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరు కొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు సహకరించారు. ఈప్రమాదం ఎలా జరిగిందనే విషయమై పరిశీలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

బాధితులకు అండగా ఉంటాం: అశోక్‌

పెద్దకర్రివానిపాలెంలో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టం వాటిల్లిన మత్స్యకారులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పలాస ఆర్డీవో ఆర్‌.అప్పలరాజుతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చారు. ఘటనా స్థలం నుంచే కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో ఫోన్‌లో మాట్లాడి మత్స్యకారులను ఆదుకోవా లని కోరారు. అలాగే జనసేన, వైసీపీ నాయకులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చారు.

Updated Date - Jun 20 , 2026 | 12:12 AM