Share News

రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:10 AM

స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆలయం సమీపంలో గల శ్రీకృష్ణ రైస్‌మిల్లులో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. మిల్లు నుంచి పొ గలు రావడంతో యజమా నులకు సమాచారం మిచ్చారు.

రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం
రైస్‌మిల్లులో అగ్నికి ఆహుతవుతున్న మిషనరీ

  • మిషనరీ, ప్యానల్‌బోర్డులు దగ్ధం

  • రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం

పాతపట్నం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆలయం సమీపంలో గల శ్రీకృష్ణ రైస్‌మిల్లులో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. మిల్లు నుంచి పొ గలు రావడంతో యజమా నులకు సమాచారం మిచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ కె.మధుసూద నరావు, వీఆర్వో అన్నాజీరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే మిల్లులో గల మిషనరీ (యంత్ర పరికరాలు) చుట్టూ మంటలు అలుము కొన్నా యి. సమాచారం అందుకున్న పర్లాకిమిడి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంట లను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రైస్‌మిల్లులోని మిషనరీ పూర్తిస్థాయిలో దగ్ధం కాగా విద్యుత్‌ ప్యానల్‌బోర్డు, విలువైన యంత్రాలు దగ్ధమైనట్టు మిల్లు య జమానులు తెలిపారు. సుమారు 30 నుంచి 40 బియ్యం ప్యాకెట్లు దగ్ధం కాగా, సుమారు రూ.15 లక్షలు ఆస్తి నష్టం జరగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కాగా ఇటీవలే ఈ మిల్లులో మోటార్లు చోరీకు గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై మిల్లు యజమానులు ఎరుకోల కృష్ణారావు, వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 01:10 AM