వంటపని ముగించుకొని వెళుతూ..
ABN , Publish Date - May 25 , 2026 | 12:09 AM
బుడుమూరు వద్ద జాతీయ రహదారి పై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుక్కళ్ల ముత్తమ్మ (43) దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
- రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
లావేరు, మే 24 (ఆంధ్రజ్యోతి): బుడుమూరు వద్ద జాతీయ రహదారి పై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుక్కళ్ల ముత్తమ్మ (43) దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళం రూరల్ మండలం మొపసుబందర్‌కు చెందిన ముత్తమ్మ ఫంక్షన్లలో వంటలు చేసుకుని రోజుకూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే ఆదివారం కూడా లావేరు మండలంలో ఓ గ్రామంలో ఆదివారం జరిగిన ఫంక్షన్‌కు వంట చేసేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతూ బుడుమూరు వద్ద రోడ్డు దాటుతుండగా రణస్థలం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢీకొనడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. బైక్‌పై వెళ్తున్న నడుపూరి వాసు, అతని భార్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిం చారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. వీరిది లావేరు మండలం ఎస్‌ఎన్‌పురం గ్రామస్థులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతుండగా వారిని పరామర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతదేహాన్ని శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినట్లు లావేరు పోలీ సులు తెలిపారు. మృతురాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.