Share News

నైపుణ్యాలతో ఆర్థిక స్వావలంబన సాధ్యం

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:49 PM

స్వయంశక్తి సంఘాల మహిళలు నైపు ణ్యం పెంపొందించు కోవ డం ద్వారా ఆర్థిక స్వావ లంబన సాధించ వచ్చని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నా రు.

నైపుణ్యాలతో ఆర్థిక స్వావలంబన సాధ్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఎమ్మెల్యే కూన రవికుమార్‌

పొందూరు, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): స్వయంశక్తి సంఘాల మహిళలు నైపు ణ్యం పెంపొందించు కోవ డం ద్వారా ఆర్థిక స్వావ లంబన సాధించ వచ్చని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నా రు. యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా పెను బర్తిలో మహిళలకు మగ్గం వర్క్‌లో శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు వాటంతట అవే పెరుగుతా యన్నారు. లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ పేడాడ శ్రీనివా సరావు మాట్లాడుతూ.. మహిళల స్వయం ఉపాధి కోసం వివిధ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ పైడి రాజా, నాబార్డ్‌ డీజీఎం రమేష్‌ కృష్ణ, శిక్షణా సంస్థ డైరెక్టర్‌ రాంజీ మాట్లా డుతూ.. తమ సంస్థ ద్వారా ఇంతవరకు 11 వేలకు పైగా మహిళలకు సుమారు 40 కోర్సుల్లో శిక్షణ ఇచ్చామన్నారు. ఈ అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, పార్టీ జిల్లా కార్యదర్శి సీపాన శ్రీరంగ నాయకులు, మండల ఉపాధ్యక్షుడు బాడాన గిరి, పీఏసీఎస్‌ అధ్య క్షుడు వండాన మురళి, ఎంఎంఎస్‌ అధ్యక్షురాలు పైడి అరుణ, ఏపీఎం శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 11:49 PM