ఎట్టకేలకు భూ సమస్యలకు పరిష్కారం
ABN , Publish Date - May 25 , 2026 | 11:43 PM
శ్రీకాకుళం రూరల్ గూడెం పంచాయతీలో పదే ళ్లుగా ఉన్న భూ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం లభిం చింది. ఈ మేరకు ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ ప్రాంత రైతు లతో సోమవారం సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించారు.
రైతులతో ఎమ్మెల్యే శంకర్ సమావేశం
అరసవల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్ గూడెం పంచాయతీలో పదే ళ్లుగా ఉన్న భూ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం లభిం చింది. ఈ మేరకు ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ ప్రాంత రైతు లతో సోమవారం సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. భూ రికార్డుల సమస్య లతో ఇబ్బందులు పడుతున్న రైతులకు న్యాయం జరి గేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని పత్రాలు ఉండి కూడా రిజిస్ట్రేషన్ కాని భూ సమస్యలు, హద్దుల వివాదాలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనం తరం పలువురు రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో స్థానిక పెద్దలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.