Share News

కోటబొమ్మాళి ఏసీబీ కేసులో తుది ఉత్తర్వులు

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:20 AM

కోటబొమ్మాళి తహసీల్దార్‌ కార్యా లయంలో 2015లో నమోదైన ఏసీబీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తుది నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ (విజిలెన్స్‌-3) శాఖ నుంచి జీవోఆర్టీ 1276, 1277లు విడుదల చేసింది.

 కోటబొమ్మాళి ఏసీబీ కేసులో తుది ఉత్తర్వులు

ఎంఆర్‌ఐకి ఇంక్రిమెంట్ల కోత.. నాటి తహసీల్దార్‌కు విముక్తి

11 ఏళ్ల సుదీర్ఘ విచారణకు ముగింపు

శ్రీకాకుళం, జూలై 24(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి తహసీల్దార్‌ కార్యా లయంలో 2015లో నమోదైన ఏసీబీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తుది నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ (విజిలెన్స్‌-3) శాఖ నుంచి జీవోఆర్టీ 1276, 1277లు విడుదల చేసింది. ఈ కేసులో అప్పటి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఎంఆర్‌ఐ)గా పనిచేసిన బొమ్మన బాలాజీ శ్రీనివాసమ్‌పై ఆరోపణలు రుజువు కావడంతో ప్రభు త్వం ఆయనకు శిక్ష ఖరారు చేసింది. రెండు ఇంక్రిమెంట్లు కట్‌ చేసింది. ఇదే కేసులో ఉమ్మడి విచారణ ఎదుర్కొన్న నాటి కోటబొమ్మాళి తహసీ ల్దార్‌ వై.శ్రీనివాసరావుపై ఆరోపణలు నిరూపణ కాకపోవడంతో ఆయనకు ఊరటనిస్తూ కేసును కొట్టివేసింది. వివరాలిలా ఉన్నాయి..

కోటబొమ్మాళిలో ఎంఆర్‌ఐగా పనిచేస్తున్న బొమ్మన బాలాజీ శ్రీని వాసమ్‌ 2015 జూన్‌ 3న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ కండక్ట్‌ రూల్స్‌ ఉల్లంఘించినట్లు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ 2016 ఆగస్టు 17న ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. సీసీఎల్‌ఏ ఆదేశాలతో 2017లో క్రమశిక్షణ చర్యలు ప్రారంభం కాగా, విచారణాధికారిగా శ్రీకాకుళం జాయింట్‌ కలె క్టర్‌ 2023 ఏప్రిల్‌ 10న నివేదిక అందించారు. ఈ విచారణలో ఎమ్‌ ఆర్‌ఐ బాలాజీ శ్రీనివాసమ్‌పై మోపిన ఏకైక అభియోగం రుజువైనట్లు ఆ నివేదికలో స్పష్టం చేశారు. ఆ నివేదిక, తదనంతరం అధికారి ఇచ్చిన వివరణను పరిశీలించిన ప్రభుత్వం.. బాలాజీ శ్రీనివాసమ్‌కు రెండు వార్షి క గ్రేడ్‌ ఇంక్రిమెంట్లను నిలిపివేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి జి.సాయిప్రసాద్‌ జీవో 1276 ఉత్తర్వులు జారీ చేశారు.

తహసీల్దార్‌కు ఊరట..

ఇదే ఏసీబీ దాడి ఘటనలో అప్పటి కోటబొమ్మాళి తహసీల్దార్‌ వై.శ్రీని వాసరావుపై కూడా ఉమ్మడి విచారణ జరిగింది. అయితే జాయింట్‌ కలెక్టర్‌ చేపట్టిన విచారణలో తహసీల్దార్‌పై అభియోగం నిరూపణ కాలే దు. జేసీ విచారణ నివేదిక, అధికారి ఇచ్చిన లిఖితపూర్వక వివరణను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వై.శ్రీనివాసరావుపై తదుపరి చర్యల ను ఉపసంహరించుకుంటూ జీవో 1277 జారీ చేసింది.

11 ఏళ్ల తరువాత..

2015లో ఏసీబీ ట్రాప్‌ జరగ్గా.. 2017లో విచారణ ప్రారంభమై, 2023 లో రిపోర్టు రాగా... తాజాగా 2026 జూలై 24న ప్రభుత్వం ఈ ఫైళ్లపై తుది ఉత్తర్వులు ఇవ్వడంతో 11 ఏళ్ల నాటి కేసుకు ముగింపు పడి నట్ల యింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏను, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jul 25 , 2026 | 12:20 AM