Share News

మునిసిపల్‌ ఓటర్ల తుదిజాబితా విడుదల

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:41 PM

: పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ఓటర్ల తుదిజాబితాను కమిషనర్‌ ఇ.శ్రీనివాసులు ఆదివారం విడుదల చేశారు.

  మునిసిపల్‌ ఓటర్ల తుదిజాబితా విడుదల
ఓటర్ల తుదిజాబితా, పోలింగ్‌ కేంద్రాల వివరాలను విడుదల చేస్తున్న పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు, సిబ్బంది :

పలాస, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ఓటర్ల తుదిజాబితాను కమిషనర్‌ ఇ.శ్రీనివాసులు ఆదివారం విడుదల చేశారు. మునిసిపల్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 36 వార్డుల ఓటర్ల వివరాలు, 67 పోలింగ్‌ కేంద్రాలకు చెందిన తుది జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల్లో సంబంధిత ప్రతులు నోటీసు బోర్డులో పెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మేనేజర్లు నర్సింహరావు, త్రినాథరావు, ఏఈ కిరణ్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:41 PM