Share News

సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:01 AM

ww

సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం
టెక్కలి: దీక్షలు నిర్వహిస్తున్న యూటీఎఫ్‌ నాయకులు:

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం కొన సాగుతుందని యూటీఎఫ్‌ నాయకులు తేల్చిచెప్పారు. జిల్లాలోని తహ సీల్దార్‌ కార్యాలయం ఎదుట రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు యూటీఎఫ్‌-3.0 రణభేరిలో భాగంగాదీక్ష కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం రెవెన్యూ అధికారులకు యూటీఎఫ్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను పరిష్కరించడంలో విఫల మయ్యిందని ఆరోపించారు. 12వ పీఆర్సీ అమలుచేయాలని, పెండింగ్‌ డీఏ విడుదల చేయాలని, ఆర్థిక బకాయిలను హామీనిచ్చిన ప్రకారం చెల్లించాలని పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించేలా కృషి చేయలని డిమాండ్‌ చేశారు. (ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - Mar 25 , 2026 | 12:02 AM