ఇరువర్గాల కొట్లాట ఇరువర్గాల కొట్లాట
ABN , Publish Date - May 05 , 2026 | 12:12 AM
స్థానిక జీడిపండు బొమ్మ జంక్షన్ వద్ద ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసింది. ఆదివారం రాత్రి మొత్తం నలుగురు యువకులు ఆ ప్రాంతంలోని జిరాక్స్ షాపు వద్ద సిగెరెట్ కావాలని కోరారు.
పలాస, మే 4(ఆంధ్రజ్యోతి): స్థానిక జీడిపండు బొమ్మ జంక్షన్ వద్ద ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసింది. ఆదివారం రాత్రి మొత్తం నలుగురు యువకులు ఆ ప్రాంతంలోని జిరాక్స్ షాపు వద్ద సిగెరెట్ కావాలని కోరారు. తమ వద్దలేవని నిర్వాహకులు చెప్పడంతో ఇరువురి మధ్యా ఘర్షణ జరిగింది. దీంతో యువకులు షాపు యజమానిపై ముష్టిఘాతాలు కురిపించి పరారయ్యారు. సోమవారం సంబంధిత యువకుల కోసం షాపు యజమాని బంధువులు, ఆ కాలనీ వాసులు గాలించి పట్టుకున్నారు. పలాసకు చెందిన కె.నిఖిల్ అనే వ్యక్తిని పట్టుకొని ఆయన్ను కేబుల్‌వైర్లతో కట్టివేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాను షాపు వద్ద నిలబడి ఉంటే అకారణంగా కొట్టారని నిఖిల్ చెబుతుండగా... సిగరెట్ ఇవ్వలేదనే అక్కసుతో తమపై యువకులు దాడి చేశారని షాపు యజమానులు చెబుతున్నారు. అనంతరం ఇరువర్గాలు కాశీబుగ్గ పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.