గ్యాస్ సమస్య పరిష్కారమయ్యేంతవరకూ పోరాటం
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:05 AM
కమర్షి యల్ గ్యాస్ సమస్య పరిష్కారమయ్యేంత వర కూ పోరాటం చేస్తామని జిల్లా హోటల్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు మెట్ట నాగరాజు అన్నారు.
జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు
గ్యాస్ ఏజెన్సీ తీరుకు నిరసనగా ర్యాలీ
ఇచ్ఛాపురం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కమర్షి యల్ గ్యాస్ సమస్య పరిష్కారమయ్యేంత వర కూ పోరాటం చేస్తామని జిల్లా హోటల్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు మెట్ట నాగరాజు అన్నారు. సోమవా రం దాసన్న పేట జంక్షన్ వద్ద ఆయన విలేక రులతో మాట్లాడుతూ.. ఇచ్ఛాపురం పట్టణంలో ఉన్న సిద్ధ బైరవి గ్యాస్ ఏజెన్సీ నుంచి కమర్షి యల్ గ్యాస్ సిలిండర్లను సక్రమంగా సరఫరా చేయకుండా ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నారని, అధికారులు స్పందించి తక్షణం చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో గ్యాస్ కొరత లేనప్పటికీ ఇచ్ఛా పురంలో కొరత తీవ్రంగా వేధిస్తోందని, ఇప్పటికే కొన్నొ హోటళ్లు మూత పడ్డాయన్నారు. ఇచ్ఛాపురం గ్యాస్ ఏజెన్సీ ప్రతి నిధి బాండ్ పేపర్లు రాస్తేనే సిలిండర్లు ఇస్తామని కొందరితో బాండ్‌లు తీసుకున్నారని విమర్శిం చారు. గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూత బడ్డాయని, దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల మంది వర్కర్లు ఉపాధి కోల్పోయారన్నారు.
నేడు హోటళ్ల బంద్
గ్యాస్ కొరత కారణంగా మంగళవారం పట్టణంలోని అన్ని హోటళ్లు, టీ షాపులు బంద్ చేస్తున్నామని సం ఘం ప్రతినిధులు తెలిపారు. దాసన్నపేట నుంచి మార్కెట్ జంక్షన్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నో గ్యాస్.. నో ఫుడ్ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. డీటీ శ్రీహరికి వినతి పత్రం అందిం చారు. అలాగే ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జేఎంఆర్ రాజా, జిల్లా సంఘం కార్యదర్శి సతీష్, మాజీ అధ్యక్షుడు బి.శ్రీనురెడ్డి, గవరయ్య, తులసయ్యరెడ్డి, హేమ, మురళి, బబ్లూ, ఆనంద్ పాల్గొన్నారు.