భూ సమస్యపై కొట్లాట.. కేసు నమోదు
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:16 AM
చీపుర్లపాడు గ్రామంలో ఓ భూ సమస్యపై ఒకే కుటుంబానికి చెందిన చల్ల రాంబాబు, చల్ల మంజుల మధ్య మం గళవారం రాత్రి జరిగిన ఘర్షణ కొట్లాటకు దారితీసింది.
కోటబొమ్మాళి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): చీపుర్లపాడు గ్రామంలో ఓ భూ సమస్యపై ఒకే కుటుంబానికి చెందిన చల్ల రాంబాబు, చల్ల మంజుల మధ్య మం గళవారం రాత్రి జరిగిన ఘర్షణ కొట్లాటకు దారితీసింది. దీంతో ఇరు వర్గాల ఫిర్యా దుల మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. చల్ల గవరమ్మకి ఇద్దరు కుమారులు కాగా వీరిద్దరూ గతంలోనే చనిపోయారు. వీరిలో పెద్దకుమారుడి కొడుకైన రాం బాబు గవరమ్మతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో గవరమ్మ తనకున్న రెండు ఎకరాల భూమిలో ఒక ఎకరం పొలాన్ని రాంబాబు పేరున రిజిస్ట్రేషన్ చేయిం చింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళంలో నివాసముంటున్న చిన్నకుమా రుడి భార్య చల్ల మంజుల తన కుమార్తె పద్మణి, కుమారుడు పవన్‌కుమార్‌లతో కలిసి చీపుర్లపాడు వచ్చి గవరమ్మను నీలదీశారు. దీంతో అక్కడే ఉన్న రాంబాబు వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో వారిమధ్య కొట్లాట జరిగింది. దీంతో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.