రైతులందరికి ఎరువులు పంపిణీ చేయాలి: జేడీఏ
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:01 AM
వ్యవసాయశాఖ సిబ్బంది నమోదుచేసిన ఈ-క్రాప్ నమోదు ప్రాప్తికి రైతులందరికి ఎరువులను పంపిణీచేయాలని వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ తెలిపారు.
ఎల్.ఎన్.పేట, జూలై 13(ఆంధ్రజ్యోతి): వ్యవసాయశాఖ సిబ్బంది నమోదుచేసిన ఈ-క్రాప్ నమోదు ప్రాప్తికి రైతులందరికి ఎరువులను పంపిణీచేయాలని వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ తెలిపారు. సోమవారం తురకపేట-కృష్ణాపురం గ్రామ సచివాలయంలో జరుగుతున్న ఎరువుల పంపిణీని పర్యవేక్షించారు. కాగా తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ ఎరువుల పంపిణీని పరిశీలించి రైతులందరికి ఎరువులను అందించాలని సిబ్బందికి సూచించారు. వీరితోపాటు ఏవో కిరణ్‌వాణి ఉన్నారు.
యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు : తహసీల్దార్
జలుమూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని తహసీల్దారు జె.రామారావు హెచ్చరించారు. టెక్కలిపాడు, అక్కురాడ గ్రామ సచివాలయాల్లో రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా ఎరువులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారులు యూరియాతో పాటు ఏమైనా పురుగుమందులు లింకు పెట్టినట్లు రుజువైనా అటువంటి షాపులు లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. పరిశీలనలో ఆర్.ఐ జగదీష్, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.
ఫనందిగాం, జూలై 13(ఆంధ్రజ్యోతి): నందిగాంలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. నందిగాం-1 రైతుసేవా కేంద్రంలో, తెంబూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ ద్వారా ఏర్పాటుచేసిన పంపిణీని తెంబూరు పీఏసీఎస్ చైర్మన్ పోలాకి చంద్రశేఖరరావు ప్రారంభించారు. కార్య క్రమంలో ఏవో పి.శ్రీకాంత్ వర్మ, నీటి సంఘం అధ్యక్షులు జె.జయరాం పాల్గొన్నారు.