అధిక ధరలకు ఎరువులు
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:29 PM
ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత దుకాణాల లెసెన్స్‌లు రద్దుచేస్తామని కొత్తూరు డివిజన్ వ్యవసాయశాఖ ఏడీఏ బి. రాజగో పాలరావు అన్నారు.
విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు
- ఏడీఏ రాజగోపాలరావు
ఎల్.ఎన్.పేట, జూన్29 (ఆంధ్రజ్యోతి): ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత దుకాణాల లెసెన్స్‌లు రద్దుచేస్తామని కొత్తూరు డివిజన్ వ్యవసాయశాఖ ఏడీఏ బి. రాజగో పాలరావు అన్నారు. తురకపేట జంక్షన్‌లోని ఎరువుల దుకాణాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, ఎరువుల నిల్వలను పరిశీలించారు. ప్రభు త్వ ధరల ప్రకారం రైతులకు ఎరువులను విక్రయిం చాలన్నారు. అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదు లు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
యూరియా కొరత ఉండదు
జిల్లాలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం అన్నివిధాలుగా తగిన చర్యలు తీసుకుంటుందని, రైతులు ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని ఏడీఏ రాజగోపాలరావు అన్నారు. రైతుసేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా ఎరువులను అందజేస్తామన్నారు. సరిప డినంత యూరియాను మూ డు విడతలుగా రైతులకు అందించటం జరుగుతుం దని తెలిపారు. ఆయనతో పాటు వ్యవసాయాధికారి కిరణ్‌వాణి, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.