Share News

ప్రతిరైతుకూ ఎరువులు, విత్తనాలు

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:01 AM

ఖరీఫ్‌ సాగుచేసే రైతు లకు అవసరమైన మేరకు ఎరు వులు, విత్తనాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ అన్నారు.

ప్రతిరైతుకూ ఎరువులు, విత్తనాలు
మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ

డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ

సరుబుజ్జిలి, జూన్‌ 17 (ఆంధ్ర జ్యోతి): ఖరీఫ్‌ సాగుచేసే రైతు లకు అవసరమైన మేరకు ఎరు వులు, విత్తనాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ అన్నారు. ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీపీ కిల్లి రమాదేవి అధ్యక్షతన మం డల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖపై చర్చ సమయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ సభ్యుడు సురవ రపు నాగేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ గోవింద శివానంద మూర్తి, ఎంపీటీసీ సింహాచలం మాట్లాడుతూ.. రైతు లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు అందించాలని కోరారు. దీనికి డీసీసీబీ చైర్మన్‌ స్పందిస్తూ రాష్ట్రప్రభుత్వం రైతులకు ఇబ్బం దులు లేకుండా ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో విత్త నాలను సిద్ధం చేసిందన్నారు. ఖరీఫ్‌ సాగుకు అవసరమైన సాగు నీరందించేందుకు ఇప్పటికే ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ వంశధార ఇరిగేషన్‌ అధికారులకు తగు ఆదేశాలిచ్చారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం. పావని, ఏవో మన్మథరావు, మండల ప్రత్యేక ఆహ్వా నితుడు కేవీజీ సత్యనారాయణ, ఏపీఎం గోవింద రావు, మండల పరిషత్‌ ఏవో ప్రసాదరావు, ఎంఈవో బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:01 AM