Share News

ఎరువుల వినియోగం తగ్గించాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:16 PM

పంటల సాగులో రైతులు రసాయ న ఎరువుల వినియోగం తగ్గించాలని అధికారులు పేర్కొన్నారు.

ఎరువుల వినియోగం తగ్గించాలి
కొత్తూరు: గురండిలో ప్రకృత వ్యవసాయంపై ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు

టెక్కలి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పంటల సాగులో రైతులు రసాయ న ఎరువుల వినియోగం తగ్గించాలని అధికారులు పేర్కొన్నారు. మంగళ వారం నర్సింగపల్లిలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం (రాగోలు) శాస్త్ర వేత్త పి.ఉదయ్‌ బాబు, టెక్కలి డివిజన్‌ సహాయ సంచాలకుడు కె.జగ న్మోహనరావు, మండల వ్యవసాయాధికారులు వై.సురేష్‌, ఎన్‌.శ్రీని వాస రావు రైతులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషీ వికాస్‌ యోజన్‌ పథకంపై అవగాహన కల్పించారు. అపరాలు, రాగులు, కట్టిజనుము, నువ్వులు, వరి పంటల్లో యాజమాన్యాలు, తెగుళ్లపై వివరించారు. యూరియా వినియోగం, పొంచివున్న ప్రమాదం, సేం ద్రియ ఎరువులు వాడకం, భూమి ఆరోగ్యంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో గ్రామీణ వ్యవసాయ సహాయకులు విక్కీ, పోలాకి షణ్ముఖరావు, గుజ్జూరు సత్యం తదితరులు ఉన్నారు.

యాజమాన్య పద్ధతులు పాటించాలి

నందిగాం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వేరుశనగ సాగులో యాజమా న్య పద్ధతులను రైతులు విధిగా పాటించాలని మండల వ్యవసాయాధి కారి పి.శ్రీకాంత్‌వర్మ అన్నారు. మంగళవారం వల్లభరాయుడుపాడులో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రబీలో సాగుచేస్తున్న వివిధ పంటలకు సంబంధించి ఇ-క్రాప్‌ నమోదు చేయించుకోవాలని ఏవో సూచించారు. రైతు సేవా కేంద్రాల్లో వీఏఏలను సంప్రదించి వివరాలను అందించాలన్నారు.

రైతులు మెలకువలు పాటించాలి

కొత్తూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) రైతులు ప్రకృతి వ్యవసాయం లో మెలకువలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా ప్రకృ తి వ్యవసాయ అడిషనల్‌ డీపీఎం ధనుంజయరావు పిలుపునిచ్చారు. మంగళవారం గురండిలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలను రైతులు పాటించాలని అన్నారు. కార్యక్రమంలో సీతంపేట ఐటీడీఏ డీపీఎం స్వర్ణలత, సర్పంచ్‌ బోర సింహాద్రినాయుడు, మాజీ ఎంపీటీసీ లక్ష్మీ నారాయణనాయుడు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:16 PM