బిక్కుబిక్కుమంటూ..
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:18 AM
చదువుకునేందుకు ఈ పాఠశాలకు రావాలం టే విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ భయప డుతున్నారు.
పెచ్చులూడుతున్న పదనాపురం పాఠశాల పైకప్పు
భయాందోళనలో విద్యార్థులు
మెళియాపుట్టి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): చదువుకునేందుకు ఈ పాఠశాలకు రావాలం టే విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ భయప డుతున్నారు. మండలంలోని పదనాపురం మం డల పరిషత్ పాఠశాలలో 10మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్ధకు చేరుకోవడంతో కొన్నాళ్ల పాటు ఒక ఇంటిలో పాఠశాలు చెప్పేవారు. అయితే ఆ ఇం టిని ఖాళీ చేయాల్సి రావడంతో తిరిగి మళ్లీ అదే శిథిలావస్థలో ఉన్న పాఠశాలలోనే ప్రస్తుతం తరగ తులు నిర్వహిస్తున్నారు. గదిలో పై కప్పు స్లాబ్ అంతా పూర్తిగా పాడైవడం వల్ల ఎవరిపై ఎప్పుడు పోడిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి ప్రమాదం జరగక ముందే సంబంధిత అధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లిందడ్రులు కోరుతున్నారు.