Share News

కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యం

ABN , Publish Date - May 25 , 2026 | 11:56 PM

సైన్యంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తన కుమార్తెపైనే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యం

- భార్య ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు

ఆమదాలవలస, మే 25(ఆంధ్రజ్యోతి): సైన్యంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తన కుమార్తెపైనే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఆమదాలవలస పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. సైనికుడిగా పనిచేస్తున్న సదరు వ్యక్తి సెలవులపై వచ్చి నప్పుడల్లా మద్యం మత్తులో సుమారు 16 ఏళ్ల కుమార్తెను భయ పెట్టి శారీరకంగా హింసించే వాడు. ఇటీవల సెలవుపై వచ్చిన వ్యక్తి అదే విధంగా ప్రవర్తించడంతో ఈ విషయం తెలుసుకున్న తల్లి సోమవారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిని ఎస్‌ఐ బాలరాజు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి ఆదేశాల మేరకు జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 11:58 PM