‘ఉపరితల జలాలతో సాగు’
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:50 PM
ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణంలో వస్తున్న మార్పు లకు అనుగు ణంగా ఖరీఫ్ సీజన్‌లో ఉపరితల జలాలతో పంటలను సాగు చేయాలని భూగర్భ జలశాఖ డీడీ ఎన్‌వీకే దుర్గాప్రసాద్ సూచిం చారు.
రణస్థలం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణంలో వస్తున్న మార్పు లకు అనుగు ణంగా ఖరీఫ్ సీజన్‌లో ఉపరితల జలాలతో పంటలను సాగు చేయాలని భూగర్భ జలశాఖ డీడీ ఎన్‌వీకే దుర్గాప్రసాద్ సూచిం చారు. ‘జలధార-జలహారతి’ంలో భాగంగా మంగ ళవారం వేల్పురాయి, అర్జున వలస గ్రామాల్లో పర్యటించి చెరువులను పరిశీలించారు. బావుల్లోని భూగర్భ జలాలు పరిశీలించారు. వేల్పు రాయి పరిధిలో 2.5 మీటర్ల లెవెల్‌లో నీరు ఉన్నట్లు గుర్తించారు. ఆరుతడి పంటలపై రైతులు ఆసక్తి చూపాలన్నారు. భూగర్భ జలాలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్ర మంలో పలువురు రైతులు పాల్గొన్నారు.