వైసీపీ పాలనలో రైతుల కుదేలు
ABN , Publish Date - May 18 , 2026 | 12:10 AM
‘గత వైసీపీ ప్రభు త్వంలో రైతాంగం కుదేలైంది. పంటలకు కనీస మ ద్దతు ధర కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారిని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఇప్పు డేమో అన్నదాతలపై కపట ప్రేమను చూపిస్తున్నా రు.’
అప్పుల ఊబిలోకి నెట్టేశారు..
పంటలకు కనీస మద్దతు ధర కల్పించలేదు
ఇప్పుడు మాత్రం కపట ప్రేమ చూపిస్తున్నారు
మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం
టెక్కలి, మే 17(ఆంధ్రజ్యోతి): ‘గత వైసీపీ ప్రభు త్వంలో రైతాంగం కుదేలైంది. పంటలకు కనీస మ ద్దతు ధర కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారిని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఇప్పు డేమో అన్నదాతలపై కపట ప్రేమను చూపిస్తున్నా రు.’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్ర హం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ వైసీపీ నా యకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో వ్యవసాయరంగం తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. ‘గత ఐదేళ్లపాటు అధికారంలో ఉండి రై తాంగాన్ని పూర్తిగా వి స్మరించింది. సరైన స మయంలో విత్తనాలు, ఎరువులను అందించ కుండా ఇబ్బందులకు గురిచేసింది. పంటల కు గిట్టుబాటు ధర కూ డా కల్పించలేదు. రైతు భ రోసా పేరుతో ప్రచారం చేసుకున్నా వాస్తవంగా రై తుల జీవితాల్లో భరోసా లేకుండా చేసింది. అప్పు ల ఊబిలోకి నెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు వారి పట్ల సానుభూతి మాటలు మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. మామిడి రై తుల సమస్యలపై మాట్లాడేముందు వైసీపీ హ యాంలో ఉద్యానవన రైతులు ఎదుర్కొన్న కష్టాలు గుర్తుచేసుకోవాలి. ఎ గుమతులు తగ్గి మార్కెటింగ్ వ్యవస్థలు కూలిపోయి రైతులు మధ్యవర్తిల చేతిలో దోపిడీకి గురైనప్పుడు జగన్ సర్కారు ఏమి చేసింది. అప్పట్లో మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. కనీస మద్దతు ధర కోసం రోడ్లపై ఆందోళనలు చేసినా పట్టించు కోలేదు. అప్పట్లో వైసీపీ నేతలు కేవలం ప్రచార రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. వారే ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చన త రువాత రైతులకు న్యాయం జరి గేలా ప్రతీ అంశాన్ని సమీక్షిస్తుం ది. మామిడి మార్కెటింగ్ సదు పాయాలు, కొనుగోలు కేంద్రాలు, ధరల స్థిరీకరణపై ఇప్పటికే చర్యలు ప్రారంభిం చింది. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటుధర అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రైతుల పేరుతో డ్రామాలు చేయడం వైసీపీకి అలవాటు అయిపోయింది. ఇప్పటికైనా చౌకుబారు విమర్శలు మానుకోవాలి.’ అని అచ్చెన్న హితవుపలికారు.