రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: రవికుమార్
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:52 PM
రాష్ట్రంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కృషి చేస్తోందని రాష్ట్ర పీయూసీ చైర్మ న్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నా రు.
ఆమదాలవలస, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కృషి చేస్తోందని రాష్ట్ర పీయూసీ చైర్మ న్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నా రు. బుధవారం కొర్లకోట గ్రామంలో రూ.1.69 కోట్లతో నిర్మించిన 11 సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభించారు. రైతులకు సబ్సిడీపై ప్రభుత్వం మంజూ రు చేసిన విత్తనా లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే దృక్పథంతో వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, కాలువలు, తాగునీటి సదుపాయాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత రెండేళ్లలో నియోజక వర్గంలో రూ.200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్య క్షురాలు తమ్మినేని సుజాత, పార్టీ జిల్లా అధ్య క్షుడు మొదలవలస రమేష్, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, నారాయణపురం ఆనకట్టు చైర్మన్ సనపల ఢిల్లేశ్వరరావు, టీడీ పీ మండల అధ్యక్షుడు నూకరాజు, ఎంపీటీసీ అన్నెపు భాస్కరరావు, దూసి సాగునీటి సం ఘం అధ్యక్షుడు హను మంతు బాలకృష్ణ, సనపల అప్పలనాయుడు, అధికారులు పాల్గొ న్నారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
బూర్జ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): కాళపర్తి పంచాయతీ సుంకరిపేట గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ లో చేరాయి. వీరికి ఎమ్మెల్యే కూన రవి కుమార్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అమల వుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీరామ్మూర్తి, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.