Share News

రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి: బగ్గు

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:53 PM

. రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. పంటల్లో చీడపీడల నివారణకు డ్రోన్‌ వినియోగం ద్వారా తక్కువ, డబ్బు ఆదా అవుతుందని, యూరియా ఎరువు కొరతను అధిగమించవచ్చని తెలిపారు.

 రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి: బగ్గు
ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రైతులకు డ్రోన్‌తో ఎరువుల వినియోగంపై అవగాహన కల్పిస్తున్న జేడీ త్రినాఽథస్వామి

పోలాకి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): . రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. పంటల్లో చీడపీడల నివారణకు డ్రోన్‌ వినియోగం ద్వారా తక్కువ, డబ్బు ఆదా అవుతుందని, యూరియా ఎరువు కొరతను అధిగమించవచ్చని తెలిపారు. బుధవారం పోలాకి మండలంలోని కత్తెరవానిపేటలో వ్యవసాయశాఖ జేడీ త్రినాఽథస్వామి, ఏడీ వెంకటమధు, ఏవో చిరంజీవి ఇఫ్‌కో కంపెనీ ద్వారా మొక్కజొన్న పంటల తెగుళ్ల నివారణకు నానో యూరియాప్లెస్‌ మందును డ్రోన్‌ద్వారా పిచికారీ చేయించారు.ఈ మేరకు డ్రోన్‌ యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే పోలాకి తహసీల్దార్‌ కార్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి తొంబై ఐదులక్షలు మంజూరుచేసిందని చెప్పారు.

Updated Date - Feb 04 , 2026 | 11:53 PM