Share News

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం: రవికుమార్‌

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:47 PM

రాష్ట్రంలో రైతన్నల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా చర్యలు తీసుకుంటోం దని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం: రవికుమార్‌
రైతులకు పాస్‌ పుస్తకాలు అందిస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

పొందూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతన్నల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా చర్యలు తీసుకుంటోం దని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. కింతలి గ్రామంలో ఆది వారం రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే పేరుతో ఎన్నో వివాదాలకు కారణమయ్యారని, ప్రభుత్వ భూములను కొల్లగొట్టడమే లక్ష్యంగా నాడు రీ సర్వే చేయించారన్నారు. వైసీపీ హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ రైతులకు న్యాయం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆర్‌.వెంకటేష్‌, టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, అనకాపల్లి చినరంగ, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఎ.రాము, నాయకులు సీపాన శ్రీరంగనాయకులు, బాడాన గిరి, కింతలి ఎంపీటీసీ హనుమంతురావు, మాజీ సర్పంచ్‌లు పైడి రామ ప్రసాద్‌, డి.గణపతి, అసిరినాయకుడు, పైడి అరుణ పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:47 PM