‘రైతు పక్షపాతి మంత్రి అచ్చెన్నాయుడు’
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:48 PM
రైతు పక్షపాతి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అని మండలం ముఖలింగాపురం, నర్సింగపల్లి పంచాయతీలకు చెందిన రైతులు అన్నారు.
టెక్కలి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): రైతు పక్షపాతి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అని మండలం ముఖలింగాపురం, నర్సింగపల్లి పంచాయతీలకు చెందిన రైతులు అన్నారు. సోమవారం టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడుకు ఘనంగా సత్కరించారు. మదనగోపాలసాగరం ఎత్తి పోతల పథకానికి అదనంగా రూ.4కోట్ల11లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు. వీటి ద్వారా నర్సింగపల్లి, ముఖ లింగాపురం, రాంపురం, గూడేం పంచాయతీల పరిధిలో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలాకి షణ్ముఖరావు, దారపు రాము, గుజ్జూరు సత్యం, కోడూరు చంద్రమోహన్, సింగుపురం షణ్ముఖరావు, చలపతి, పోలాకి తిరుపతిరావు తదితరులు ఉన్నారు.