Share News

బాహుదా నదిలో రైతు గల్లంతు

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:23 AM

Farmer drowns in river సైదాలపుట్టుగకు చెందిన గంగయ్య (50)కు బాహుదా నది నది అవతల శాసనం రెవెన్యూ పరిధిలో పొలం ఉంది. ఈ పొలంలో దమ్ములు పట్టేందుకుగానూ మంగళవారం ఉదయం 11.15 గంటల సమయంలో బాహుదా నది దాటుతూ గల్లంతయ్యాడు. ఇటీవల వర్షాలకు నీటి ప్రవాహం పెరగడంతో నదిలో కొట్టుకుపోయాడు.

బాహుదా నదిలో రైతు గల్లంతు
బాహుదా’లో గాలిస్తున్న పోలీసులు ఇన్‌సెట్‌లో గంగయ్య (ఫైల్‌)

పొలం పనుల కోసం వెళుతుండగా..

అర్ధరాత్రి వరకూ దొరకని ఆచూకీ

ఇచ్ఛాపురం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): బాహుదా నదిలో ఓ రైతు గల్లంతయ్యాడు. నది అవల పొలానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సైదాలపుట్టుగకు చెందిన గంగయ్య (50)కు బాహుదా నది నది అవతల శాసనం రెవెన్యూ పరిధిలో పొలం ఉంది. ఈ పొలంలో దమ్ములు పట్టేందుకుగానూ మంగళవారం ఉదయం 11.15 గంటల సమయంలో బాహుదా నది దాటుతూ గల్లంతయ్యాడు. ఇటీవల వర్షాలకు నీటి ప్రవాహం పెరగడంతో నదిలో కొట్టుకుపోయాడు. ఆయన ఆచూకీ కోసం స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు గాలించారు. మంగళవారం అర్ధరాత్రి అయినా ఆచూకీ లభ్యం కాలేదు. గంగయ్యకు భార్య కాంతమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు పిల్లలకూ వివాహాలు అయ్యాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు లోపింటి పద్మనాభం, దక్కత శ్రీను, గిరిల పర్యవేక్షణలో గ్రామస్థులు గంగయ్య ఆచూకీ కోసం నది పరీవాహక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇచ్ఛాపురం రూరల్‌ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

సైదాలపుట్టుగకు కిలోమీటర్‌ దూరంలో ఉన్న పాయితారి దగ్గర్లో అరకబద్ర బ్రిడ్జి ఉంది. అలా శాసనాం వెళ్లిపోవచ్చు. కానీ సైదాలపుట్టుగ నుంచి నదిలో నుంచి వెళ్తే దగ్గరవుతందనే ఉద్దేశంతో వెళ్లి చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గత రెండేళ్లలో ఇద్దరు ఈ నదిలో గల్లంతయ్యారు. ప్రభుత్వం ఇక్కడ చిన్న వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Aug 26 , 2026 | 12:23 AM