డీఎస్సీపై అసత్య ప్రచారం మానుకోవాలి
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:14 AM
డీఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారం మానుకోవాలని ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూ సీ చైర్మన్ కూన రవికుమార్ కోరారు.
శ్రీకాకుళంఅర్బన్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): డీఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారం మానుకోవాలని ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూ సీ చైర్మన్ కూన రవికుమార్ కోరారు. డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ గాని, ఆయన చెంచా నాయకులు గాని బహిరంగ చర్చకు రావాలని సవాల్‌విసిరారు. ఈమేరకు మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీనాయకులు మొదట పరీక్ష రాయకుండానే ఉద్యో గాలు ఇచ్చారన్నారు. టెట్‌పరీక్ష రాయకుండా ఉద్యోగం ఇచ్చినట్టు దమ్ముంటే నిరూపించాలని సవాల్‌విసిరారు. జగన్ పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఎక్కడ చదివాడో తెలియదని, జగన్ చదివిన డిగ్రీ సర్టిఫికెట్ బూతద్దంలో వెతికినా కనిపించదన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై జగన్ బహిరంగ చర్చకు సిద్దమా అన్నారు. ధర్మాన అపరభగీరఽథుడు అనడంచూస్తుంటే వైసీపీ నాయకుల మాటలకు సిగ్గుండాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన పనులకు శిలాఫలకాలు వేసి, వాటికి కొబ్బరికాయలు కొడితే అపర భగీరఽథులు అయిపోయారా అని అన్నారు. మాజీ మంత్రులు, ధర్మాన సోదరులకు జిల్లాలో రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదన్నారు సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, ఏపీ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల డైరెక్టర్ పీఎంజే బాబు, కనీస వేతనాల సలహాల కమిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ విబూది సూరిబాబు, పీఏసీఎస్ చైర్మన్ సుధాకర్, చిట్టిమోహన్ పాల్గొన్నారు.