Share News

కూటమిపై అసత్య ప్రచారం మానుకోవాలి

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:42 PM

ప్రజాతీర్పును గౌరవించాలని, కూట మి నాయకులపై అసత్య ప్రచారం మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు టీడీపీ నాయకులు హితవుపలికారు.

 కూటమిపై అసత్య ప్రచారం మానుకోవాలి
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు:

శ్రీకాకుళం అర్బన్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజాతీర్పును గౌరవించాలని, కూట మి నాయకులపై అసత్య ప్రచారం మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు టీడీపీ నాయకులు హితవుపలికారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వక్రీకరించేలా ప్రసాదరావు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం విశాఖ కాలనీలో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో శ్రీకాకుళం రూరల్‌ మండల టీడీపీ అధ్యక్షుడు మూకళ్ల శ్రీనివాస్‌, గొండు వెంకటరమణమూర్తి, జడ్పీటీసీ ప్రతినిధి రంథి అప్పలస్వామి, అరసవల్లి నరసింహులు విలేకరులతో మాట్లాడారు. సానివాడ ఎంపీటీసీ ఎన్నికలో తొలుత 300 మెజార్టీ వచ్చిందని అధికారులను వైసీపీ నాయకులు తప్పుదో వపట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రీకౌంటింగ్‌లో చెల్లని ఓట్లను తొలగించిన అనంతరం కూటమి అభ్యర్థి ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని చెప్పారు.

Updated Date - Nov 10 , 2026 | 11:42 PM