Share News

సౌకర్యాలు లేక సిబ్బంది అవస్థలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:51 PM

ల్‌.ఎన్‌.పేట ఉపాధి హామీ పథకం కార్యాల యంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు వ్యయం వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధిహామీ పథకం పక్కాగా అమలుచేస్తున్నాయి.

 సౌకర్యాలు లేక సిబ్బంది అవస్థలు
దస్ర్తాలతో నిండిపోయిన ఉపాధిహామీ పథకం కార్యాలయం:

ఎల్‌.ఎన్‌.పేట, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ఎల్‌.ఎన్‌.పేట ఉపాధి హామీ పథకం కార్యాల యంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు వ్యయం వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధిహామీ పథకం పక్కాగా అమలుచేస్తున్నాయి. అయితే ఇక్కడ సిబ్బందికి పక్కాభవనం లేకుండాపోయింది.ఈపథకం ప్రారంభించినప్పటి నుంచి మండల పరిషత్‌ కార్యాలయం భవనంలోని ఓ ఇరుకుగా ఉండే గదిలో నిర్వహిస్తున్నారు. ఉపాధి సిబ్బందికి కేటాయించిన ఒకే గదిలో 11 మంది సిబ్బంది నిర్వహిస్తున్నారు. వీరితోపాటు 20 మంది ఫీల్ట్‌అసిస్టెంట్లు నిత్యం బిల్లులు, సమావేశాలతోపాటు పలు పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తుంటారు. ఏపీవో, ఈసీ, కంప్యూటర ఆపరేటర్లు, టీఏలు ఒకేసారి వస్తుండడంతో కిక్కిరిసిపోతోంది. దీనికితోడు అదే గదిలో కార్యాలయం సామగ్రితోపాటు ఉపాధి పనులకు సం బంధించిన పరికరాలు, రికార్డులు ఉండడంతో మరో మనిషి తప్పించు కోవడానికి కూడా వీల్లేకుండాపోతోంది. కాగా ఎంపీడీవో కార్యాలయానికి ఆనుకుని ఉపాధిహామీ పథకం, వెలుగు సిబ్బంది కార్యాలయ భవనం కోసం దశాబ్దకాలం కిందట స్ర్తీశక్తి భవనం పనులు ప్రారంభించారు. ఈ పనులు వివిద కారణాల వల్ల తుది దశలో పదేళ్లుగా నిలిచిపోయాయి. అయితే ఇటీవల భవనాన్ని పోలీసు అవుట్‌పోస్టుగా ఏర్పాటుచే సేందుకు ఈ శాఖ వర్గాలు అనుమతులు తీసుకొచ్చి పనులు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేశారు.ఈభవనం సంక్రాంతితర్వాత ప్రారంభించనున్నట్లు పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నా యి. శాఖాపరంగా పనిభారం పెరుగుతున్న నేపథ్యంలో ఇరుగు గదిలో విఽధి నిర్వహణకు అగచాట్లకు గురవుతున్నామని ఉపాధి సిబ్బంది, ఫీల్డ్‌ అసిస్టెంట్లు వాపోతున్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:51 PM