శిక్షణలో మహిళలకు సౌకర్యాలు: డీఆర్‌డీఏ పీడీ
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:06 AM
పొందూ రులో ఖాదీ, చేనేత క్లస్టర్‌లో భాగంలో ప్రస్తుత సాంకేతికతో నేత ప్రక్రియ పై మహిళలకు నిర్వహిం చనున్న 60 రోజుల శిక్షణ లో పూర్తిస్థాయిలో సౌక ర్యాలు కల్పించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్ తెలిపారు.
పొందూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): పొందూ రులో ఖాదీ, చేనేత క్లస్టర్‌లో భాగంలో ప్రస్తుత సాంకేతికతో నేత ప్రక్రియ పై మహిళలకు నిర్వహిం చనున్న 60 రోజుల శిక్షణ లో పూర్తిస్థాయిలో సౌక ర్యాలు కల్పించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం పొందూరులో సాయిబాబా చేనేత సొసైటీలో కామన్ ఫెసిలిటీ సెంటర్‌లో శిక్షణ కార్యక్రమానికి జరు గుతున్న ఏర్పాట్లను పీడీ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వాసుదేవరావు, ఆర్‌అండ్‌బీ ఏఈ పీటీ రాజు, ఏపీఎం శ్యామలరావు, ఈవో పి. జగదీష్, చేనేత సొసైటీ మేనేజర్ శ్రీనివాసరావు, టీడీపీ మండలాధ్యక్షుడు సీహెచ్ రామ్మోహన్ పాల్గొన్నారు.
ఆర్థిక కార్యకలాపాల్లో పారదర్శకతకు చర్యలు: పీడీ
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 16(ఆంధ్రజ్యోతి): సంఘాల ఆర్థిక కార్యకలాపాల్లో పారద ర్శకతకు చర్యలు తీసుకుంటున్నట్లు మెప్మా పీడీ బొడ్డేపల్లి శైలజ తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని మెప్మా మహిళామార్ట్‌పై గల పట్టణ మహిళాసమాఖ్య వనరుల కేంద్రం లో సిబ్బందికి, ఆర్పీలకు శిక్షణ నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సంఘా ల్లో పొదుపు, అప్పుల జమకు సంబంధించిన లెక్కల వివరాలను సాంకేతిక విధానంలో యాప్ ద్వారా సభ్యులు మన డబ్బులు-మన లెక్కలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామ న్నారు. కార్య క్రమంలో పట్టణ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు బి.నాగలక్ష్మి, సిబ్బంది డి. కృష్ణారావు, బి.రామారావు, జి.కిషోర్‌బాబు, వై.శారదావాణి, జి.జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.