శ్రీకాకుళం నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పాలన పొడిగింపు
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:07 AM
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పాలన కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీకాకుళం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పాలన కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పాలనాకాలం అక్టోబరులో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు 11 నుంచి మరో ఆరు నెలల పాటు లేదా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించే వరకు (ఈ రెండింటిలో ఏది ముందైతే అది) ప్రత్యేకాధికారి పాలన అమ లులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ చేసిన విజ్ఞప్తి మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జీవోఆర్టీ 1204ని శుక్రవారం విడుదల చేశారు.