అభివృద్ధిని ప్రజలకు వివరించండి
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:05 AM
కూట మి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు అర్థ మయ్యేలా వివరించాల్సిన బాధ్యత పార్టీ నాయకు లు, కార్యకర్తలపై ఉందని మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు సూచించారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): కూట మి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు అర్థ మయ్యేలా వివరించాల్సిన బాధ్యత పార్టీ నాయకు లు, కార్యకర్తలపై ఉందని మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు సూచించారు. శనివారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వ హించి సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గత వైసీపీ పరిపాలనతో గ్రామాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్ర మం జరగలేదని, 20 నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కు వివరించాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లు మధ్యలోనే నిలిచిపోయా యని, వీటిని పూర్తి చే సేందుకు కూటమి ప్రభు త్వం బిల్లులు చెల్లిస్తుంద న్నారు. అలాగే కోటబొ మ్మాళి పంచాయతీ పెద్ద పొందరవీధికి చెందిన నా యుడుగారి శాంతరావు ప్రమాదపువశాత్తు మృతి చెందడంతో ఆయన భార్య లక్ష్మికి పార్టీ తరఫున రూ.2లక్షల బీమా పరిహారం చెక్కును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ కింజరాపు హరివరప్రసాద్, కొత్తమ్మతల్లి పాలకమండలి చైర్మన్ కోరాడ గోవిందరావు, పార్టీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్, పట్టణ అధ్య క్షుడు కె.గోవిందరావు, నాయకులు బి.పాండు రంగరావు, పి.గోపి తదితరులు ఉన్నారు. అలాగే పట్టణ పేదరిక నిర్మూళన (మోప్మా)పీడీ బొడ్డేపల్లి శైలజతోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, బైపల్లి పరమేశ్వరరావు, దేపల్లి కామయ్య, దేపల్లి నాగరాజు, ప్రశాంత్, సూరాడ శేఖర్ తదితరులు మర్యాదపూర్వకంగా మంత్రిని కలుసుకున్నారు.