Share News

క్వారీ లీజులను వినియోగించుకోండి

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:06 AM

నీలిరంగు గ్రానైట్‌ క్వారీల లీజు అవ కాశాలను సద్వినియోగం చేసుకోవాలని గనులశాఖ సహాయ సంచాలకులు విజయలక్ష్మి అన్నారు.

క్వారీ లీజులను వినియోగించుకోండి
మాట్లాడుతున్న గనులశాఖ ఏడీ విజయలక్ష్మి

టెక్కలి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): నీలిరంగు గ్రానైట్‌ క్వారీల లీజు అవ కాశాలను సద్వినియోగం చేసుకోవాలని గనులశాఖ సహాయ సంచాలకులు విజయలక్ష్మి అన్నారు. బుధవారం ఆసక్తి గల గ్రానైట్‌ లీజుదారులతో నిర్వ హించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏపీఎండీసీకి చెందిన గ్రానైట్‌ క్వారీ లీజు అనుమతులపై ఆమె పలువురికి అవగాహన కల్పించారు. క్వారీ లీజులు పొందాలంటే ఎలా దరఖాస్తులు చేసుకోవాలని వివరించారు. మైన్స్‌ డీడీ కార్యా లయ ఏజీ ఆర్‌.కుమార్‌నాయుడు, ఏపీఎండీసీ సహాయ ప్రాజెక్ట్‌ అధికారి దీన్‌ పాల్‌, మైన్స్‌ కార్యాలయ ఏజీ రాము, ఆర్‌ఐ గణేష్‌, పలు గ్రానైట్‌ క్వారీల నిర్వా హకులు, లీజు కోసం దరఖాస్తు చేసుకునేందుకు పలువురు హాజరయ్యారు.

Updated Date - Jan 29 , 2026 | 12:06 AM