Share News

వివాదాస్పద భూముల పరిశీలన

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:00 PM

గెడ్డకంచరాంలో సర్వే నెం బర్లు 21/11, 21/12లో 4.80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వివాదస్పద డి-పట్టా భూములను ట్రైనీకలెక్టర్‌ డి.పృథ్వీరాజ్‌కుమార్‌ సోమవారం పరిశీలించారు.

వివాదాస్పద భూముల పరిశీలన
ఇరువర్గాల రైతులతో మాట్లాడుతున్న ట్రైనీ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌

జి.సిగడాం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): గెడ్డకంచరాంలో సర్వే నెం బర్లు 21/11, 21/12లో 4.80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వివాదస్పద డి-పట్టా భూములను ట్రైనీకలెక్టర్‌ డి.పృథ్వీరాజ్‌కుమార్‌ సోమవారం పరిశీలించారు. ఈ భూములపై గ్రామానికి చెందిన ఉజ్జారు ఈశ్వర రావు, దళితుల మధ్య వివాదం నెలకొంది. ఈ మేరకు ఇరువర్గాలతో ట్రైనీకలెక్టర్‌ మాట్లాడారు. వారి వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నా తీసుకురావాలని, వాటిని పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటా మని అన్నారు. అనంతరం బాతువ సచివాలయాన్ని సందర్శించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించినా, సమయపాలన పాటించకపోయినా చర్యలు తప్పవని సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట డీటీ ఎన్‌.నిర్మల, ఆర్‌ఐ ఎ.రాధ, మండల సర్వేయర్‌ శాంతారాం, వీఆర్వో బూటు రాజశేఖర్‌, విలేజ్‌ సర్వేయర్‌ ఉన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 11:00 PM