పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:33 PM
Ready for the exams ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాలు నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాలు నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్తు వంటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎస్ ప్రభుత్వ సేవల పై ప్రజల్లో సానుకూల దృక్పథం నెలకొనేలా పనిచేయాలని, డాక్యుమెంట్ అప్‌లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.