ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:58 PM
కొత్త పాలవర్గంలో కొత్తవారు అధికంగా ఉన్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రతిఒక్కరూ బాధ్యతగా పని చే యాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు.
పలాస, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): కొత్త పాలవర్గంలో కొత్తవారు అధికంగా ఉన్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రతిఒక్కరూ బాధ్యతగా పని చే యాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని, సోమవారం జరగనున్న మునిసిపల్ కౌన్సిల్‌లో హుందాగా వ్యవహరించాలని తెలిపారు. ఆదివారం పలాసలో కొత్త పాలకవర్గంతో మాక్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వైస్‌చైర్మన్ ఎన్నిక, అనుసరించాల్సిన విధివాధానాలపై చర్చించారు. అనంతరం కూటమి కౌన్సిలర్ల తమ అభిప్రాయాలు వెళ్లడించారు. కార్యక్రమంలో పలాస నియోజకవర్గం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకన్న చౌదరి, మునిసిపల్ చైర్మన్ వజ్జ గంగాభవాని, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్జ బాబూరావు, పట్టణాధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావుయాదవ్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, గాలి కృష్ణారావు, మల్లా కృష్ణారావు, డొక్కరి శంకర్, గోళ్ల చంద్రరావు, చెల్లూరి రామకృష్ణ పాల్గొన్నారు.
కార్యకర్తల కృషితోనే ఏకగ్రీవం సాధ్యం
పలాసరూరల్, నవంబరు22(ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సమిష్టి కృషితోనే పెదం చల, కేదారిపురం పంచాయతీల ఏకగ్రీవం సాధ్యమైందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస టీడీపీ కార్యాలయంలో పెదంచల పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్ని కకావడంవతో అభ్యర్థి పీరికట్ల అంజి ఎమ్మెల్యేను కలిశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పి.విఠల్‌రావు,జడ్పీటీసీ దువ్వాడ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. కాగా గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మండలంలోని లక్ష్మీపురం, గరుడఖండి, అల్లుకోల, రెంటికోటల్లో పర్యటిం చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పి.విఠల్‌రావు, జడ్పీటీసీ దువ్వాడ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.