ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలి
ABN , Publish Date - May 18 , 2026 | 11:25 PM
ప్లాస్టిక్ రహిత సామాజంకోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. సోమవారం స్థానిక ఆలాంధ్రరోడ్‌లోని చెత్త నుంచి సందప తయారీకేంద్రంలో ఘనవ్యర్ధాల నిర్వహణా కేంద్రాన్ని ప్రారంభించారు.
పాతపట్నం, మే 18(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ రహిత సామాజంకోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. సోమవారం స్థానిక ఆలాంధ్రరోడ్‌లోని చెత్త నుంచి సందప తయారీకేంద్రంలో ఘనవ్యర్ధాల నిర్వహణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌తో పంచాయతీలకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. పర్యావరణానికి ముప్పుగామారిన ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకై ప్రభుత్వం ముందుడుగు వేసిందన్నారు. ఇందులో భాగంగా శాస్త్రీయ పద్ధతిలో ఈ ఆధునిక యంత్రాలను వినియోగించి ప్లాస్టిక్ వ్యర్థాలను సులభతరంగా వేరుచేసి రీసైక్లింగ్‌కు పంపించనున్నట్లు తెలిపారు. దీనిద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు పంచాయతీలకు అదనపు ఆదాయం లభించనుందన్నారు.నియోజకవర్గాన్ని పచ్చదనం- పరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా ప్రజా భాగస్వామ్యంతో పనిచేసేందుకు నాయకులు, అధికారులు సమన్వ యంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నందిగామ ప్రసాదరావు, ఎంపీడీవో హెచ్‌వీ రమణమూర్తి టీడీపీ నేతలు పైల బాబ్జీ, సైలాడ సతీష్‌లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. :