Share News

‘దేశభద్రతకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలి’

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:53 PM

దేశ భద్రతకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పలువురు వక్తలు అన్నారు. నగరంలోని ఉపనిషన్మందిరం వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా సైనిక సంక్షే మ నిధికి రూ.75,116 అందించారు.

‘దేశభద్రతకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలి’
జిల్లా సైనిక సంక్షేమ నిధికి విరాళం అందిస్తున ్న అతిథులు

శ్రీకాకుళం కల్చరల్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): దేశ భద్రతకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పలువురు వక్తలు అన్నారు. నగరంలోని ఉపనిషన్మందిరం వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా సైనిక సంక్షే మ నిధికి రూ.75,116 అందించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు)లో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద, మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్‌ ఈ మొత్తాన్ని జిల్లా సైనిక సంక్షేమ సంస్థ అధ్యక్షుడు పూర్ణచంద్ర రావుకు అందజేశారు. అనంతరం త్రివిధ దళాలకు చెందిన 15 మంది సైనికులను సత్కరించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌ ఎస్‌ఎన్‌ స్వామి, ఇప్పిలి శంకరశర్మ, మందిరం ప్రతినిధులు కామేశ్వర రావు, ఈశ్వరరావు, నిక్కు అప్పన్న, డా.ఎం.మోహనరావు, డా.బి.కోమల రావు, నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 11:54 PM