ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:51 PM
ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలిం చి చట్టపరంగా విచారించి బాధితులకు న్యాయం చేయా లని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలిం చి చట్టపరంగా విచారించి బాధితులకు న్యాయం చేయా లని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 57 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీస్ అధికారుల దృష్టికి ఈ సమస్యలు తీసుకువెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.