Share News

అంచనాలు వేసి.. నివేదికలు ఇచ్చినా

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:55 PM

పాతపట్నం మండలంలో గత ఏడాది అక్టోబరులో మొంథా తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదు. ముంపు బారినపడి దెబ్బతిన్న పంటలను తక్షణమే ఉన్నతాధికారులు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదికలిచ్చి ఆరు నెలలు గడిచిపోయింది. అయినా పరిహారం కోసం ఎదురుచూపులు తప్పడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు.

అంచనాలు వేసి.. నివేదికలు ఇచ్చినా
పాతపట్నం సమీపంలో మొంథా తుఫాన్‌ వల్ల ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు (ఫైల్‌) :

పాతపట్నం మార్చి 23(ఆంధ్రజ్యోతి): పాతపట్నం మండలంలో గత ఏడాది అక్టోబరులో మొంథా తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదు. ముంపు బారినపడి దెబ్బతిన్న పంటలను తక్షణమే ఉన్నతాధికారులు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదికలిచ్చి ఆరు నెలలు గడిచిపోయింది. అయినా పరిహారం కోసం ఎదురుచూపులు తప్పడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు.

మండలంలోని గుమ్మగెడ్డ పరివాహక ప్రాంతం లోని పాతపట్నం, చాకిపల్లి, ఏఎస్‌కవిటి, ఆర్‌ఎల్‌ పురం, రొంపివలస, రొమదళ, తామర, తీమర, సీది గ్రామాల్లో రైతాంగ పంటపొలాలు గతఏడాది అక్టోబరులో మొంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు ముంపునకు గురై దెబ్బతిన్నాయి. అలాగే పొగడవిల్లిగెడ్డ పరీవాహక ప్రాంతంలోని గంగువా డ, సింగుపురం, బోరుభద్ర, పెద్దలోగిడి తదితర గ్రామాల్లో పంటపొలాలు కూడా ముంపునకు గుర య్యాయి. ఈమేరకు మండలంలో 2,319 రైతులకు సంబంధించిన 1,169ఎకరాల్లో పంట ముంపు బారి నపడింది. అప్పట్లో వ్యవసాయశాఖ ఉన్నతాధికా రులు క్షేత్రస్థాయి పరిశీలించి రూ.1.13కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తించి, నివేదికను ఉన్నతాధికారుల కు పంపించారు. అలాగే గుమ్మగెడ్డ, పొగడవిల్లి గెడ్డలపై పలుచోట్ల గండ్లుపడినా నేటికీ పూడ్చలేద ని రైతులు వాపోతున్నారు. కాగా మొంథా తుఫాన్‌ పరిహారంపై ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టామ ని పాతపట్నం ఏవో కె.సింహాచలం తెలిపారు.

Updated Date - Mar 23 , 2026 | 11:55 PM