Share News

ధర పెరిగినా.. తగ్గేదేలే

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:24 AM

Massive gold and silver purchases ఉగాది రోజు కొత్తవస్తువు కొనుగోలు చేసినా.. ప్రారంభించినా శుభపరిణామమని చాలామంది ప్రజలకు సెంటిమెంట్‌. ఈ నేపథ్యంలో జిల్లాలో గురువారం ఉగాది వేళ.. జోరుగా వ్యాపారాలు సాగాయి. బంగారం దుకాణాలు, సెల్‌ పాయింట్లు, ఎలక్ర్టానిక్‌, గృహాపకరణాలు, వస్త్రదుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.

ధర పెరిగినా.. తగ్గేదేలే
నరసన్నపేట బంగారం కొనుగోలు చేస్తున్న వినియోగదారులు

జిల్లాలో భారీగా బంగారం, వెండి కొనుగోళ్లు

ఉగాది సెంటిమెంట్‌తో వ్యాపారాల జోరు

గృహోపకరాలు, వస్త్రదుకాణాలు కూడా కిటకిట

నరసన్నపేట/ టెక్కలి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ఉగాది రోజు కొత్తవస్తువు కొనుగోలు చేసినా.. ప్రారంభించినా శుభపరిణామమని చాలామంది ప్రజలకు సెంటిమెంట్‌. ఈ నేపథ్యంలో జిల్లాలో గురువారం ఉగాది వేళ.. జోరుగా వ్యాపారాలు సాగాయి. బంగారం దుకాణాలు, సెల్‌ పాయింట్లు, ఎలక్ర్టానిక్‌, గృహాపకరణాలు, వస్త్రదుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. జిల్లాలో గురువారం ఒక్కరోజే రూ.100కోట్లకుపైగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వ్యాపారాలు సాగాయని రాష్ట్ర జీఎస్టీ అధికారులు అంచనా వేస్తున్నారు. అధికంగా బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేశారు. జిల్లాలో 600కుపైగా బంగారం, వెండి దుకాణాలు ఉన్నాయి. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గ, సోంపేట, ఆమదాలవలస, రణస్థలం ప్రాంతాల్లో బంగారం అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ ఏడాది బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. గతేడాది ఉగాదికి పది గ్రామాలు రూ.92వేలు ఉండగా.. రూ.1.57వేలకు చేరింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా ధగధగ లాడుతోంది. కిలో వెండి రూ.2.75 లక్షలకు చేరింది. భారీగా ధర పెరిగినా.. చాలామంది బంగారం, వెండి ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపడం గమనార్హం. నరసన్నపేట, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో బంగారం దుకాణాల్లో వ్యాపారులు లక్కీడ్రా ప్రకటించారు. కొంతమంది ఆభరణాలపై తరుగు శాతాన్ని తగ్గించారు. గ్రాము ధరపై రూ.50 ఆఫర్‌ ఇచ్చారు. పాత బంగారం విక్రయించేవారికి మరో రూ.50 ఆఫర్‌ ప్రకటించారు. అలాగే శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, హిరమండలాల్లో గృహాపకరణ వస్తువులు, వస్త్ర విక్రయాలు జోరుగా సాగాయి. సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు కూడా కొనుగోలు చేశారు. ఫ్రిజ్‌లు, ఏసీలు, కూలర్లు తదితర గృహాపకరణాలు కొనుగోలు చేసినవారికి వ్యాపారులు లక్కీకూపన్లతో బహుమతులను అందజేశారు.

Updated Date - Mar 20 , 2026 | 12:24 AM