Share News

గజ ఈతగాళ్లతో గాలించినా..

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:07 AM

పీజీపేట సముద్రతీరంలో సరదాగా గడిపేందుకు సోమవారం వెళ్లిన ఎచ్చెర్ల శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతైన సంగతి తెలిసిందే. ముగ్గురు యువ కులు సముద్రంలో దిగగా వారిలో అలల తాకిడికి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

గజ ఈతగాళ్లతో గాలించినా..
గాలిస్తున్న గజ ఈతగాళ్లు

  • మూడు రోజులైనా దొరకని మనోజ్‌ ఆచూకీ

శ్రీకాకుళం క్రైం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పీజీపేట సముద్రతీరంలో సరదాగా గడిపేందుకు సోమవారం వెళ్లిన ఎచ్చెర్ల శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతైన సంగతి తెలిసిందే. ముగ్గురు యువ కులు సముద్రంలో దిగగా వారిలో అలల తాకిడికి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారి కోసం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం భామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన విద్యార్థి మణికంఠ మృతదేహం పుక్కళ్లపేట ఒడ్డుకు కొట్టుకువచ్చింది. రాజాం పట్టణానికి చెందిన మరో విద్యార్థి మనోజ్‌ కోసం గత మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించలేదు. దీంతో ఎక్కడైనా చిక్కుకున్నాడేమో అన్న అనుమానంతో బుధవారం పీజీపేట, పుక్కళ్లపేటలో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయినా ఫలితం లేకపోవడం... ఓ పక్క చీకటి పడడంతో గాలింపు చర్యలను వాయిదా వేసినట్టు ఏడీఆర్‌ఎఫ్‌వో శ్రీనుబాబు తెలిపారు.

Updated Date - Nov 12 , 2026 | 12:07 AM