Share News

సంక్షేమ పథకాలకు ‘ఈ-శ్రమ్‌’ తప్పనిసరి

ABN , Publish Date - May 02 , 2026 | 12:03 AM

కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే ‘ఈ-శ్రమ్‌’లో వివరాలు నమోదు తప్పనిసరని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

సంక్షేమ పథకాలకు ‘ఈ-శ్రమ్‌’ తప్పనిసరి
మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

శ్రీకాకుళం లీగల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే ‘ఈ-శ్రమ్‌’లో వివరాలు నమోదు తప్పనిసరని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నేషనల్‌ అకాడమీ ఫర్‌ కన్‌స్ట్రక్షన్‌ (నాక్‌) కార్యాలయంలో కార్మికులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సమాజంలో మొదటి శ్రామికురాలు అమ్మే అని అన్నారు. ప్రభుత్వాలు ఎన్నో కార్మిక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయని, వాటి ఫలితాలు అందరికీ అందాలంటే సంబంధిత శాఖల అధికారుల వద్ద పేర్లు నమోదు తప్పనిసరన్నారు. న్యాయ అవగాహన కలిగి ఉండడం ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు పొందడంలో ఇబ్బందులు రావన్నారు. ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా తమ కార్యాలయాన్ని లేదా 15100 టోల్‌ ఫ్రీ నెంబరులో సంప్రదించ వచ్చన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, ఆమదాలవలస అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్లు ఎంఎన్‌వీ బాబు, కె.శ్రీహరి, నాక్‌ అసిస్టెంట్‌ డెరెక్టర్‌ జి.చిట్టిబాబు, అడ్వకేట్‌ ఇందిరా ప్రసాద్‌, ప్యానల్‌ న్యాయ వాదులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 12:03 AM