Share News

రీసర్వేలో తప్పులు చోటుచేసుకోకూడదు

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:31 AM

భూ రీసర్వేలో తప్పులు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు.

రీసర్వేలో తప్పులు చోటుచేసుకోకూడదు
స్థలాన్ని పరిశీలిస్తున్న జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ ఖాన్‌

పాతపట్నం, ఆగస్టు 19(ఆంధ్ర జ్యోతి): భూ రీసర్వేలో తప్పులు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు. మండల పరిధిలోని లాబర గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వేను బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రెవెన్యూ సిబ్బందికి సర్వేపై సూచనలిచ్చారు. మొదటిసెషన్‌లో గ్రౌండ్‌ ట్రూత్‌ చేపట్టాలని.. రెండో సెషన్‌లో వెక్టరైజేషన్‌ మేపింగ్‌ ప్రక్రియ ఎప్పటికప్పుడే పూర్తి చేయాలన్నారు. భూ రీసర్వే పారదర్శకంగా జరగాలన్నారు. అంతకు ముందు మండల కేంద్రం పాతపట్నంలో కోర్టు నూతన భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. పాత కోర్టు భవనానికి చేరువలో గల ఆర్‌అండ్‌ బీ కార్యాలయ స్థలాన్ని న్యాయశాఖకు... జర్నలిస్టు కాలనీ రోడ్డుకు ఆనుకొని ఉన్న న్యాయశాఖ స్థలాన్ని ఆర్‌అండ్‌ బీకి బదలాయింపునకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరీశీలిం చినట్టు అధికారులు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ నందిగామ ప్రసాదరావు, సర్వేయర్‌ వట్టి మహేష్‌, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 12:31 AM