ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేసుకోవాలి: సీఈవో
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:55 PM
ww
ఎల్.ఎన్.పేట, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితాల్లో తప్పులు ఉంటే తప్ప నిసరిగా సరిచేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవో వెంకట్రామన్ తెలిపారు. రోటరీ నగర్ పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్ర మంలో ఎంపీడీవో పి.శ్రీనివాసరావు, వెంకటఅప్పలనాయుడు పాల్గొన్నారు.
సర్ నోటీసులపై తనిఖీలు
పాతపట్నం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాల్లో సర్ ప్రక్రియలో భాగంగా ఇచ్చే నోటీసులపై క్షేత్రస్థాయిలో అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. గంగువాడ, కొయ్యకొండలోని పోలింగ్ కేంద్రాల్లో తహసీల్దార్ నందిగామ ప్రసాదరావు, ప్రహరాజపాలెం, పెద్దలోగిడిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎంపీడీవోరమణమూర్తి, పాతపట్నం చాకిపల్లి కొరసవాడ పోలింగ్ కేంద్రాల్లో డిప్యూటీ ఎంపీడీవో బి.కృష్ణారావు ఓటర్ల ఽధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.