Share News

ఎర్రన్నాయుడు చిరస్మరణీయుడు

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:22 AM

దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు చిరస్మరణీయుడని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

ఎర్రన్నాయుడు చిరస్మరణీయుడు
కోటబొమ్మాళి: ఎర్రన్న ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, కుటుంబ సభ్యులు

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

  • ఘనంగా ఎర్రన్న జయంతి

కోటబొమ్మాళి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు చిరస్మరణీయుడని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. సో మవారం ఎర్రన్నాయుడి జయంతి సందర్భంగా స్వగ్రామం నిమ్మాడ గ్రామంలోని ఎర్రన్న ఘాట్‌ వద్ద తల్లి విజయకుమారి, కుటుంబసభ్యులతో కలిసి రామ్మోహన్‌ నాయుడు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీ ఎస్‌ మాజీ చైర్మన్‌ కింజరాపు హరివరప్రసాద్‌, రిటైర్డు ఎస్పీ కింజరాపు ప్రభాకర్‌, నిమ్మాడ సర్పం చ్‌ కింజరాపు సురేష్‌కుమార్‌, టీడీపీ జిల్లా అధ్య క్షుడు మొదలవలస రమేష్‌, పార్టీ నా యకులు చౌదరి బాబ్జీ, ధనలక్ష్మి, పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎర్రన్న విగ్రహానికి రాష్ట్ర క ళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిం దరాజులు, టీడీపీ నాయకులు బోయిన రమేష్‌ తదితరులు నివాళులర్పించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఎర్రన్న జయంతి కార్యక్రమాలు పార్టీ శ్రేణులు నిర్వహించారు. కాగా నిమ్మాడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌బీఐ బ్రాంచ్‌ కార్యాలయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు సోమవారం ప్రా రంభించారు. తహసీల్దార్‌ ఆర్‌.అప్పలరాజు, ఎంపీడీవో కుప్పిలి ఫణీంద్రకుమార్‌, ఎస్‌బీఐ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:22 AM