Share News

అన్నిరంగాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలి

ABN , Publish Date - May 04 , 2026 | 12:08 AM

దేశ జనాభాలో బీసీలు సుమారు 65 శాతం ఉన్నారని, కానీ ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో ఇంకా వెనుకబడే ఉన్నారని, వారికి అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నరసింగరావు డిమాండ్‌ చేశారు.

అన్నిరంగాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలి
మాట్లాడుతున్న బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నరసింగరావు

బీసీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు

అరసవల్లి, మే 3(ఆంధ్రజ్యోతి): దేశ జనాభాలో బీసీలు సుమారు 65 శాతం ఉన్నారని, కానీ ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో ఇంకా వెనుకబడే ఉన్నారని, వారికి అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నరసింగరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఎన్టీవో హోంలో సంఘం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు వృత్తి పరమైన నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. బీసీ హాస్టళ్లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల సంఖ్యను పెంచాలన్నారు. సంఘం నాయకుడు కిల్లాన శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీసీలు దేశానికి వెన్నెముక అని, అయినా ఇంకా వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు న్యాయమైన హక్కులను సాధించుకోవాలని, గళాన్ని బలంగా వినిపించాలన్నారు. రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు మాట్లా డుతూ.. బీసీ సంఘాలన్నీ ఐక్యంగా ఉండి సమస్యలపై పోరాటంచేయాల న్నారు. ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, బొట్టా మధు, ఈవీ సత్యనారాయణ, రాయి వేణుగోపాల్‌, జి. కృష్ణారావు, రౌతు శంకరరావు, డాక్టర్‌ పైడి సింధూర, సురేష్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 12:08 AM