Share News

అందరికీ సమన్యాయమే లక్ష్యం

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:08 AM

Equal justice is the Legal Services సమాజంలో పేద, ధనిక తేడా లేకుండా అందరికీ సమన్యాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని జిల్లా న్యాయాధికారి కొండబోలు సునీత తెలిపారు.

అందరికీ సమన్యాయమే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా న్యాయాధికారి సునీత

జిల్లా న్యాయాధికారి సునీత

శ్రీకాకుళం లీగల్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): సమాజంలో పేద, ధనిక తేడా లేకుండా అందరికీ సమన్యాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని జిల్లా న్యాయాధికారి కొండబోలు సునీత తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో సంస్థ కార్యదర్శి కె.హరిబాబు ఆధ్యర్యంలో నిర్వహించిన లీగల్‌ సర్వీసెస్‌ డే వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ‘కోర్టు ఖర్చులు భరించలేనివారు ఉచిత న్యాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చు. నిబంధనల ప్రకారం అర్హులైన వారికి ఉచిత న్యాయం అందిస్తాం. జాతీయ లోక్‌అదాలత్‌, మీడియేషన్‌ 3.0 వంటి కార్యక్రమాల ద్వారా వివిధ కేసుల్లో కక్షిదారుల పరస్పర అంగీకారం ద్వారా కేసుల రాజీకి చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు రుణాలు, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్‌ఫండ్‌ వివాదాలు, పోలీసు సంబంధమైన కేసుల బాధితులకు రాజీ ద్వారా త్వరగా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామ’ని తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ ‘ఏడాదిలో 30,281 కేసులు రాజీ ద్వారా పరిష్కరించాం. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, మండల న్యాయసేవాకమిటీల ఆధ్వర్యంలో 445 న్యాయ అవగాహనా శిబిరాలు నిర్వహించి 381 మందికి నేరుగా న్యాయ సహాయం అందించాం. ప్రీ లిటిగేషన్‌ కేసులు 244 వరకు పరిష్కరించామ’ని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు వై.బెన్నయ్య నాయుడు, బి.సాధుబాబు, సీహెచ్‌ వివేకానంద శ్రీనివాస్‌, పోక్సో న్యాయమూర్తి ఎం.సునీత, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తులు ఆర్‌.శాంతిశ్రీ, జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తులు కె.అనురాగ్‌, జమృత బేగం కమాలుద్దీన్‌, వి.సాహితి,బార్‌ అసోషియేషన్‌ అద్యక్షుడు కూన రాజారావు,కార్యదర్శి సూర్యనారాయణ, ఇందిరాప్రసాద్‌, ఆగురు ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు

Updated Date - Nov 10 , 2026 | 12:09 AM