Share News

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:17 AM

తీర ప్రాంతా లు, పర్యవరణ ప రిరక్షణ అందరి బా ధ్యతని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నా రు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
శివసాగర్‌ తీరంలో చెత్తను ఏరుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

  • ఎమ్మెల్యే గౌతు శిరీష

  • శివసాగర్‌ బీచ్‌లో పరిశుభ్రత కార్యక్రమాలు

వజ్రపుకొత్తూరు, మార్చి 11(ఆంధ్రజ్యో తి): తీర ప్రాంతా లు, పర్యవరణ ప రిరక్షణ అందరి బా ధ్యతని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. స్వచ్ఛసర్వేక్షణ్‌ కార్యక్రమంలో భా గంగా శివసాగర్‌ బీచ్‌లో బుధవారం చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తీరం పరిశుభ్రంగా ఉంచడంలో యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు. సముద్ర తీర ప్రాంతాలు పర్యా టకంగా అభివృద్ధి చెందాలంటే చెత్తరహిత ఆరోగ్యకరమైన వాతావరణ కల్పించాలన్నారు. అందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. తీరంలో చెత్తను చెత్త కుండీల్లో వేసేలా తీ రానికి వచ్చే పర్యాటకులను అవగాహన కల్పించి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేయాల న్నారు. కార్యక్రమంలో ఎంపీడీఎప్‌ రాష్ట్ర చైర్మన్‌ వజ్జ బాబూరావు, పలాస- కాశీబుగ్గ మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో రమేష్‌నాయుడు, జిల్లా గ్రంథలయ చైర్మన్‌ విఠల్‌రావు, టీడీపీ మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, మాజీ అధ్యక్షడు బుల్లోజు శశిభూషన్‌, మాజీ ఎంపీపీ గొరకల వసంతరావు, పలాస ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:17 AM