పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:54 PM
పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుం డ్కర్ అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుం డ్కర్ అన్నారు. నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి స్టేడియం పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. పరిసరాలు, వీధులు, నగరం పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పరిశుభ్రతా యజ్ఞంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్ర మంలో నగరపాలక సంస్థ సిబ్బంది, డీఆర్డీఏ ఉద్యోగులు పాల్గొన్నారు.
స్వచ్ఛ రథాన్ని వినియోగించుకోవాలి
రణస్థలం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఇళ్లలోని ప్లాస్టిక్, పేపర్లు, గాజు, ఎలకా్ట్రనిక్ వ్యర్థాలను సేకరించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా కార్యక్రమం చేప ట్టిందని, దీనిని వినియోగించుకోవాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. కోష్ట గ్రామ పంచాయతీలో శనివారం స్వచ్ఛాం ధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. అనం తరం మాట్లా డుతూ.. పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఈ వస్తువులను తూకం వేసి నిత్యావసర సరుకులు ఇవ్వ డం జరుగుతుందన్నారు. ఇందులో భాగస్వామ్యం కావడం ద్వారా గ్రామాలు శుభ్రపడతాయన్నారు. కార్యక్ర మంలో కూటమి నేతలు పిషిని జగన్నాఽథం నాయుడు, పైడి అప్పడుదొర, డీజీఎం ఆనందరావు, ఎం.కనకారావు, రౌతు శ్రీనివాసరావు, వడ్డాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పరిశుభ్రతతో ఆరోగ్యం: అశోక్
కవిటి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గ్రా మాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నా రు. కవిటిలో శనివారం ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పరిశుభ్రతతో ఆరోగ్యం సిద్ధిస్తుం దన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులు స్వచ్ఛ ప్రతిజ్ఞ చేపట్టారు. కొత్తచెరువు వద్ద పరిసరాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మణి చంద్ర ప్రకాష్, పీఏసీఎస్ చైర్మన్ బాసుదేవ్ ప్రదాన్, ఎంపీడీవో ఎల్.త్రినాథ్, ఎంఈవో ధనుం జయ మజ్జి, ఏవో శ్రీనివాసరెడ్డి, నేతలు బి.రమేష్, బి.తిరుమలరావు, ఎ.మధు, బీమా రావు రౌళో, సంతోష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.